సోషల్ మీడియోలో చేసిన ఓ పోస్టు వివాదం కావడంతో హార్వర్డ్ యూనివర్సిటీ స్పందించింది. అనుచితమైన ఫొటోను పోస్టు చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపింది. సంస్కృత భాష బోధనలో తమ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్‌మెంట్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు తెలిపింది. సంస్కృత భాష కోర్సును ప్రమోట్ చేసే క్రమంలో ఇటీవల వర్సిటీలోని దక్షిణాసియా స్టడీస్ విభాగం శ్రీకృష్ణుడి ఫొటోను SMలో షేర్ చేసింది. దీంతో హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది.