మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ సంకేతాలను గమనించండి!

స్మార్ట్‌ఫోన్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ అసాధారణంగా వేడెక్కడం, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం, డేటా వినియోగం ఒక్కసారిగా పెరగడం, గుర్తు తెలియని మెసేజ్‌లు, OTPలు రావడం, ఫోన్ పనితీరు మందగించడం, తాము ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు కనిపించడం వంటి లక్షణాలు ఫోన్ హ్యాక్‌కు సంకేతాలు కావచ్చని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాస్పద యాప్‌లను తొలగించడం, ముఖ్యమైన ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చడం, విశ్వసనీయ భద్రతా సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ను స్కాన్ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్