మీ WhatsApp గ్రూపులపై సైబర్ దాడి జరిగిందా?.. వెంటనే ఇలా చేయండి!

TG: మీ వాట్సాప్‌ గ్రూపు హ్యాకింగ్‌కి గురైనా, ఏపీకే ఫైల్‌ను పొరపాటున ఇన్‌స్టాల్ చేసినా వెంటనే ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసి, సెట్టింగ్స్‌ > యాప్స్‌లోకి వెళ్లి ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యాంటీవైరస్‌తో ఫోన్‌ను ఫుల్ స్కాన్ చేసి, బ్యాంకింగ్‌, సోషల్ మీడియా, ఈ-మెయిల్‌ పాస్‌వర్డులు మార్చేయాలి. మెసేజ్‌లు, కాల్‌లాగ్, బ్యాంకు లావాదేవీల్లో అనుమానాస్పద చర్యలు ఉన్నాయా అని పరిశీలించాలి. అన్‌ఇన్‌స్టాల్ కాకపోతే ఫోన్‌ను సేఫ్‌మోడ్‌లో రీస్టార్ట్ చేసి తొలగించాలి. సమస్య కొనసాగితే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అలాగే 1930కు ఫిర్యాదు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్