కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి: మస్క్‌

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికాలో తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన వ్యక్తం చేశారు. అధిక సంతానం పర్యావరణానికి హానికరం అనే వాదనను తోసిపుచ్చిన ఆయన, భవిష్యత్‌లో నాగరికత పతనం కావచ్చని హెచ్చరించారు. ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని సూచించారు. ఫార్చ్యూన్ నివేదికను ఉటంకిస్తూ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. యూఎన్‌ఎఫ్‌పీఏ కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్