హర్యానాలోని హన్సిలో ఓ అద్భుత చెట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సమాధ్ ఆలయం సమీపంలో ఉన్న ఈ చెట్టు వేర్లు నేలతో అనుసంధానం లేకుండా గాలిలో ఊగుతూ కనిపిస్తున్నాయి. ఈ వింత దృశ్యం చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. భక్తులు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తూ విశేషమైన పవిత్రతను అర్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.