పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత సరికొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన న్యూ లుక్ చూసి ఫ్యాన్స్‌ను ఖుషీ అవుతున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ డార్లింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వైట్ షర్ట్ ధరించి, లైట్ బియర్డ్, గ్లాసెస్‌తో ప్రభాస్ హ్యాండ్సమ్‌గా కనిపించారు. సుమంత్ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇస్తూ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ప్రభాస్ ఆకాంక్షించారు. కాగా వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు.