హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. చంబా జిల్లా పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్‌లో ‘మంచు నది’లా ప్రవహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండల నుంచి జారిపడుతున్న మంచు నదిలా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇంత విపరీతంగా మంచు కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంచు కారణంగా రహదారులు మూసుకుపోయి, సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.