విలక్షణ నటనతో తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ కోట తన ప్రతిభను చాటారు. కోట డైలాగ్ డెలివరీ, హావభావాలు, నటనా నైపుణ్యం రావుగోపాలరావు వంటి మహానటుల వారసత్వాన్ని గుర్తుచేస్తాయి. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన కుర్రాడుగా ఉన్నప్పుడు ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూతి మీద చిన్న మీసం, కళ్లకి అద్దాలతో అలనాటి హీరోలా ఉన్నారంటూ నెటిజన్‌లు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.