AP: అనంతపురం జిల్లా, పెనుకొండ పరిధిలో సంచలనం సృష్టించిన హవాలా నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారంతో హవాలా డబ్బును తరలిస్తున్న కారును పోలీసులు వెంబడించి మార్గమధ్యంలో అడ్డగించి దోపిడి ముఠాను పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 కోట్ల భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లను సీజ్ చేశారు. పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది.