HCA కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అధికారులు శుక్రవారం ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. హెచ్‌సీఏ ఆఫీసులోనే జగన్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అక్రమాల కేసులో ప్రెసిడెంట్ జగన్మోహన్ సహా ఐదుగురు నిందితులను సీఐడీ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.