ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సహకారంతో HDFC బ్యాంక్ 500 రిలేషన్‌షిప్ మేనేజర్ (RM) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి, 1-10 ఏళ్ల ఉద్యోగానుభవం ఉన్నవారు ఈ పోస్టులకు ఫిబ్రవరి 7లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం ఏడాదికి రూ.3,00,000-రూ.12,00,000 వరకు ఉంటుంది. వివరాలకు www.hdfcbank.com ను చూడొచ్చు.