యూపీలోని ఆగ్రాలో షాకింగ్ ఘటన జరిగింది. రెండు జడలు వేసుకోలేదని.. ఇంటర్ విద్యార్థినిని రక్తమొచ్చేలా కొట్టాడు ఓ స్కూల్ మేనేజర్. మూంగారామ్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. రెండు జడలతో స్కూలుకు రాలేదని గేట్ ముందు ఆపి విద్యార్థినిని కొట్టాడు. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది. విద్యార్థిని బాధతో విలవిల్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఆగ్రా పోలీసులు రంగంలోకి దిగారు. యువతికి అవసరమైన వైద్యసహాయం అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.