కస్టమర్‌లా వచ్చి.. రూ.30 లక్షల నగలు ఎత్తుకెళ్లాడు(వీడియో)

TG: కస్టమర్‌లా వచ్చిన ఓ దొంగ రూ.30 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 18, సామయ్‌పూర్ బాద్లీ వద్ద జరిగింది. ఒక జ్యువెల్లరీ షాప్‌లోకి ఓ వ్యక్తి  వచ్చి బ్రేస్‌లెట్ డిజైన్స్ చూపించమని అడిగాడు. దీంతో షాప్ ఓనర్‌ పలు రకాల డిజైన్స్ తీసి చూపిస్తుండగా ఆ దొంగ అతడ్ని మాటల్లో పెట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా షాప్ ఓనర్‌ ముఖంపై స్ప్రే కొట్టి.. బ్రేస్‌లెట్లను దోచుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగల విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕