చెన్నై తారామణి రైల్వే స్టేషన్‌లో ఈ నెల 29న ఒక మహిళను లక్ష్యంగా చేసుకొని గొలుసు లాక్కెళ్లిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ప్రకారం నిందితుడు ముందు అక్కడే తిరుగుతూ కనిపించాడు. తర్వాత మహిళ దగ్గరకు వెళ్లి కాసేపు కూర్చుని, ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.