కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చాడు(వీడియో)

యూపీలోని బిజ్నోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనని కాటువేసిన పామును పట్టుకొని ఏకంగా ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రోడ్డు పక్కన కాలువలో ఉన్న పామును గౌరవ్ బయటకు తీయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పాము కాటు వేసింది. దీంతో వెంటనే దాన్ని పట్టుకుని సమీపంలోని ఆస్పత్రికి వచ్చాడు. ఆ పాము విషపూరితమో లేదో తెలియకపోవడంతో.. దానిని చూపించి చికిత్స చేయాలని డాక్టర్లను కోరాడు. వెంటనే చికిత్స చేసి అతడిని రక్షించారు.

సంబంధిత పోస్ట్