మహిళ కాళ్లు నరికి వెండి కడియాలను దోచుకెళ్లాడు!

రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో దారుణం జరిగింది. కూలీ పనికి వచ్చిన కమలాదేవి అనే మహిళ పట్ల దుండగులు క్రూరంగా వ్యవహరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె రెండు కాళ్లను నరికి, దాదాపు ఒకటిన్నర కిలోల బరువున్న వెండి కడియాలను దోచుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. బాధితురాలు బామన్‌వాస్‌లోని సీతోడ్ గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్