గుండెపోటుతో కుప్పకూలి ఆసుపత్రి వద్దే చనిపోయాడు (వీడియో)

అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుతో పలువురు మరణిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో ఇలాంటి ఘటన జరిగింది. షారుక్‌ మీర్జా (24) అనే యువకుడికి గత రాత్రి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఉదయాన్నే షారుక్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి వెలుపల వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో షారుక్‌కు గుండెపోటు వచ్చింది. కూర్చున్న చోటనే కుప్పకూలి ఆ యువకుడు చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్