భార్యపై కన్నేశాడని కడతేర్చాడు

AP: భార్యపై కన్నేశాడని సమీప బంధువును భర్త కడతేర్చాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ధనుంజయ, శివయ్య ఇద్దరు సమీప బంధువులు. ఇద్దరూ కలిసి తరచూ మద్యం తాగేవారు. వదిన వరుస అయ్యే శివయ్య భార్యపై ధనుంజయ కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం శివయ్యకు తెలియడంతో మద్యం తాగేందుకు ధనుంజయను ఎల్‌పీ కూడలికి పిలిచాడు. సిమెంటు ఇటుకతో ధనుంజయను కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి శివయ్యను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕