ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తలపై తెల్ల జుట్టు కనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే, ఇంగ్లాండ్‌లో ర్యాన్ బ్రిగ్స్ అనే వ్యక్తి తన తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డై వేసుకున్నాడు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ముఖం పూర్తిగా వాచిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏకంగా హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నాడు. అతను తీసుకున్న హెయిర్ డై లో పారాఫెనిలెనిడియమైన్ అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు.