జింకకు పోహా పెట్టాడు.. సస్పెండ్ అయ్యాడు

ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారి వినోద్ ఓ జింకను దగ్గరకు తీసుకుని దానికి పోహా తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. వన్యప్రాణి (సంరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్