AP: ఎన్టీఆర్ (D), కొండపల్లి ఐడీఏ వద్ద ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మణి (42) కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. మణి పనిచేసే చోట పరిచయమైన యూపీకి చెందిన తిమల్ నిసాద్ ఈ హత్య చేశాడు. తన కోరిక తీర్చలేదనే ఆగ్రహంతో ఆమెను చీర కొంగుతో హత్య చేసి, ఆమె మొబైల్ ఫోన్‌తో పరారయ్యాడు. అతని ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.