మధ్య ప్రదేశ్‌కు చెందిన మహేశ్ గుర్జర్ తన కూతురు తనూ గుర్జార్(20)కు మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో ఆమె విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు పేరెంట్స్ ఒప్పుకోవడంలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన తండ్రి.. పోలీసుల ముందే తనూను కాల్చి చంపాడు.