TG: ఖమ్మం జిల్లా విక్రమ్ నగర్‌కు చెందిన భూక్యా హస్లీ(40) మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహమై భార్యను వదిలేసిన భూక్యా మదన్‌తో హస్లీ ఆరేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇటీవల అతడు మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. హస్లీ అడ్డు తొలగించుకునేందుకు మదన్ ఇద్దరు వ్యక్తులకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. ఆమెను అడవికి తీసుకెళ్లి విషమిచ్చి, గొంతు నులిమి చంపేశాడు. హస్లీ కుమార్తె ఫిర్యాదు మేరకు మదన్‌ను పోలీసులు విచారించగా నేరం అంగీకరించాడు.