ఢిల్లీ మెట్రోలో యువతులను రహస్యంగా వీడియో తీస్తున్న వ్యక్తిని మహిళలు పట్టుకున్నారు. ఫోన్లో వీడియోలు డిలీట్ చేసినా, రీసైకిల్ బిన్లో దొరకడంతో అతడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహిళలు అతడిని నిలదీయడంతో, తాను వీడియోలు తీయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఫోన్ పరిశీలించగా, రీసైకిల్ బిన్లో ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో అతడి అసలు స్వరూపం బయటపడింది.