అమ్మాయి కోసం.. స్నేహితుడిని పొడిచి చంపాడు!

AP: బాపట్ల (D) చీరాలలో దారుణం జరిగింది. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కారంచేడు (M)స్వర్ణ గ్రామానికి చెందిన కొండె త్రినాధ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఓ బాలిక విషయంలో మృతుడు త్రినాధ్‌తో అతని స్నేహితుల్లో ఒకరు గొడవ పడ్డారని గుర్తించారు. బాలికతో ప్రేమ విషయంలో కక్ష పెంచుకున్న యువకుడు త్రినాధ్‌ను కత్తితో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్