రేబీస్ వచ్చినా ట్రీట్‌మెంట్‌తో బతికాడు (వీడియో)

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన 15 ఏళ్ల కరణ్‌కు గతేడాది డిసెంబర్‌లో కుక్కకాటు వేసింది. రేబీస్ వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో అతడిలో రేబీస్ లక్షణాలు కనిపించాయి. కుక్కలా అరవడం, నీళ్లు తాగలేకపోవడం వంటి తీవ్ర లక్షణాలతో అతడు మరణిస్తాడని వైద్యులు భావించారు. అయితే, మరో ఆసుపత్రిలో 22 రోజుల వ్యవధిలో 5 రేబీస్ వ్యాక్సిన్లు ఇవ్వడంతో కరణ్ అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది వైద్యరంగంలో ఒక అద్భుతంగా పరిగణించబడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕