హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

TG: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్, విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నతాధికారులు రమేష్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్