చండీగఢ్‌లో హెడ్ కానిస్టేబుల్ నితిన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తుపాకీతో కాల్చుకోవడం వల్లే మరణం సంభవించినట్లు ప్రాథమికంగా తేలింది. అయితే, ఈ కాల్పులు అతని మైనర్ కొడుకే జరిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్టార్ 22లోని నితిన్ ఇంట్లో కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దేశీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాతే తెలుస్తాయని పోలీసులు తెలిపారు.