పాఠశాలలో మద్యం సేవిస్తూ దొరికిన హెడ్‌మాస్టర్

TG: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేటలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై గ్రామస్తులు స్పందించి, పాఠశాలలోనే మద్యం సేవిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఈ ఘటనపై ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడు బడిలోనే మద్యం సేవించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕