ఆయుర్వేదం ప్రకారం, మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక శాస్త్రీయ కోణం, ఆక్యుప్రెషర్ రహస్యం ఉంది. బంగారం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెండి శరీరంలోని అధిక వేడిని గ్రహించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రాగి కీళ్ల నొప్పులు, రక్తపోటును తగ్గిస్తుంది. ముక్కుపుడక శ్వాసకోశ ఆరోగ్యాన్ని, మహిళల్లో నెలసరి సమస్యలను మెరుగుపరుస్తుంది. చెవి రింగులు కంటి చూపును, మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. కాలి మెట్టెలు గర్భాశయ ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.