ప్రజలు ఎక్కువగా కాఫీ తాగడాన్ని అదునుగా తీసుకుని, కల్తీ మాఫియా రంగంలోకి దిగింది. క్లే, షికోరి వంటి వాటిని కలిపి కల్తీ కాఫీ పౌడర్‌ను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో FSSAI కాఫీ పౌడర్ స్వచ్ఛతను గుర్తించడానికి కొన్ని కీలక సూచనలు చేసింది. నీటిలో కలిపి చూడటం, ఫిల్టర్ పేపర్‌తో పరీక్షించడం, అయోడిన్ పరీక్ష వంటి పద్ధతుల ద్వారా కల్తీని గుర్తించవచ్చని తెలిపింది. కల్తీ కాఫీ వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.