ఆరోగ్యకర జీవనానికి మన ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా బచ్చలికూర తింటే బంగారం లాంటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. నేటి జీవనశైలితో ప్రతి ఒక్కరూ అధిక బరువు, ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బచ్చలికూరలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక రకాల ఇతర వ్యాధులు దరిచేరవని వివరిస్తున్నారు.