చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించడం, కడుపులో భారంగా ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గొంతులో గరగర, తలనొప్పి, రక్త ప్రసరణలో మార్పులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, గొంతు, సైనస్ సమస్యలు ఉన్నవారు, తరచుగా జలుబు చేసేవారు చల్లటి నీళ్లకు దూరంగా ఉండాలంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె, రక్తపోటు సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.