గాడిద పాలతో జీర్ణవ్యవస్థకు మేలు: నిపుణులు

ప్రస్తుతం గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా అనే సందేహం చాలామందిలో ఉంది. తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలు, అధిక లాక్టోస్ వంటి గుణాల వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గాడిద పాలలో విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, ఇ వంటి పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పెప్టైడ్స్, విటమిన్ సి వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలో, అలర్జీ సమస్యలు ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా, జీర్ణవ్యవస్థకు ఇవి మేలు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్