మిరియాల నీటితో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!

నల్ల మిరియాలతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీటిలో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం నివారించబడుతుంది. శరీర శక్తి రెట్టింపు అవుతుంది. మిరియాలు ఘాటైనవి కాబట్టి ఒక చిటికెడు మాత్రమే వాడాలి. అనారోగ్య సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్