గుండెపోటు.. స్కూటీపైనే మృతి

TG: జనగామ జిల్లా ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ బోడ లింగం (49) గుండెపోటుతో స్కూటీపైనే ప్రాణాలు కోల్పోయారు. మోటార్ రిపేర్ చేయించుకొని తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్కూటీపైనే కుప్పకూలిపోయారు. స్థానికులు, వాహనదారులు గమనించి వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల కాలంలో ఇలాంటి హఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరని ఈ ఘటన నిరూపించింది.

సంబంధిత పోస్ట్

✕
✕