ఆరోగ్యంగా ఉండటానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు అవసరం లేదని, ఇంట్లో వాడే సాధారణ ఉప్పుకు బదులుగా పొటాషియం ఉన్న ఉప్పును వాడటం ద్వారా గుండె జబ్బుల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండి రక్తపోటును పెంచుతుంది, అయితే పొటాషియం ఉప్పు వాడితే బీపీ అదుపులో ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 1,000 మిల్లీగ్రాముల సోడియం తగ్గించినా గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గుతుంది. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే ఉప్పు మార్చాలని హెచ్చరించారు.