హృదయవిదారకం.. 8 గంటలుగా యజమాని కోసం ఎదురుచూసిన కుక్క (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీలో హృదయం కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని మార్కెట్‌లో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను వదిలేసి వెళ్లిపోయాడు. జర్మన్ షెపర్డ్‌ జాతికి చెందిన ఆ శునకాన్ని స్కూటర్‌పై మార్కెట్‌కు తీసుకువచ్చి వదిలేశాడు. ఈ క్రమంలో ఆ కుక్క తన యజమాని తిరిగి వస్తాడని గంపెడు ఆశతో దాదాపు 8 గంటలకు పైగా ఎదురుచూసింది. అతడు తిరిగి రాకపోవడంతో ఆ శునకాన్ని నోయిడాలోని ఓ జంతువుల షెల్టర్ హోమ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్