TG: హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్న నలుగురు స్నేహితులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరందరి అంత్యక్రియలు ఒకే చితిపై నిర్వహించారు. ఆ దృశ్యం గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది. వీరు ఓ వివాహ వేడుక ముగించుకుని ఇంటికి వస్తుండగా.. వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.