నేడు తెలంగాణలో పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరిక

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో హీట్‌వేవ్ ప్రభావం ఉండనుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్