మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. దేశంలో మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు తెలంగాణలో వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరుతాయని అంచనా వేసింది.