ఫ్రాన్స్‌లో వడగాల్పుల బీభత్సం.. వెయ్యి మందికి పైగా మృతి

పశ్చిమ ఐరోపాలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేడిగాలుల తీవ్రతకు గతంలో ఎన్నడూలేని విధంగా మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల్లో ఫ్రాన్స్‌లో వెయ్యి మందికి పైగా మరణించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇళ్లలో ఉన్నవారు కూడా మరణిస్తున్నారంటే వేడి గాలుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్