తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. ‘ఆర్నబ్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నెల 30 వరకు వానలు కొనసాగే ఆస్కారముందని వెల్లడించింది. ఈ క్రమంలో 27న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండటంతో ఎల్లో అలర్ట్ జారి చేసింది. 28, 29న భద్రాద్రి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూరుస్తాయని రెడ్ అలర్ట్ ఇచ్చింది. 30న ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕