ఒడిశాలో భారీ వరద.. ముంపునకు గురైన నివాస ప్రాంతాలు

ఒడిశాలోని ఖోర్ధా జిల్లా బాణ్‌పూర్‌లో కుండపోత వర్షాలతో వరద నీరు ముచ్చెతింది. దీంతో నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. బాణ్‌పూర్-బాలుగావ్ సహా పలు ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత దృష్ట్యా ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕