ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న 162 మంది విద్యార్థులు

భారీ వర్షాల నేపథ్యంలో ఝార్ఖండ్‌ తూర్పు సింగ్భూమ్‌ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరద కారణంతో ఓ పాఠశాల ప్రాంగణం నీట మునిగింది. మొత్తం 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను తొలుత భవనంపైకి తరలించారు. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న రెస్క్యూ బృందాలు గ్రామస్థుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి.

సంబంధిత పోస్ట్