శ్రీలంకలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. డ్యాములు నిండిపోయి పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే కందలముల్ల వద్ద డ్యామ్ నీరు బిడ్జిపైకి భారీగా చేరింది. దీంతో ఓ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వాహనాన్ని నడిపాడు. నీటిమట్టం పెరిగిన పరిస్థితుల్లో ఇలా డ్రైవ్ చేయడం ప్రాణాంతకమని, బస్సు అదుపుతప్పితే పలువురు ప్రాణాలు కోల్పోయేవారని నెటిజన్లు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.