భారీ వరదలు.. ఎంపీని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లిన గ్రామస్తులు (వీడియో)

బీహార్‌లో భారీ వర్షాలు కురిశాయి. కతిహార్ కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ పర్యటించారు. ఇద్దరు గ్రామస్తులు ఎంపీని భుజాలపైకి ఎత్తుకుని తీసుకెళ్లారు. ‘ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రాజకీయ నేతలు.. మోకాళ్ల లోతు నీటిలో కూడా దిగకపోతే ఎలా’ అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ‘కష్టాల్లో ఉన్నవారిని మరింత కష్టపెట్టడం అవసరమా’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్