TG: సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలో 1,600 మంది పోలీసులు, కరీంనగర్లో 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన మార్గంలో అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. బహిరంగ సభ, పర్యటన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.