తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం నుండి రాత్రి వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.