ఏపీలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వడగళ్ల వానతో పంటలు దెబ్బతింటున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వానలు పడే అవకాశం ఉంది.